ఫేక్‌ బాంబర్స్‌పై ట్రయల్‌ ప్రారంభం

- July 24, 2018 , by Maagulf
ఫేక్‌ బాంబర్స్‌పై ట్రయల్‌ ప్రారంభం

ఫేక్‌ బాంబ్‌కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు, న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటున్నారు. 2017 జనవరి 13న జిద్‌ అలి హైవేపై ఇద్దరు వ్యక్తులు ఫేక్‌ బాంబ్‌ని అమర్చి, స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకున్నారు. ఈ ఘటనలో తొలి నిందితుడ్ని డిఎన్‌ఏ శాంపిల్స్‌ ఆధారంగా పోలీసులు అరెస్ట్‌ చేసి, అభియోగాలు మోపారు. విచారణ సందర్భంగా నిందితుడు, ఫేక్‌ బాంబ్‌ని మరో వ్యక్తితో కలిసి తయారు చేసినట్లు అంగీకరించాడు. స్థానికంగా వున్న ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికే ఈ పని చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com