సౌదీ అరేబియా ఎన్నికల్లో తొలిసారిగా పట్టం కట్టిన మహిళలు
- December 13, 2015
సౌదీ అరేబియాలోని శనివారం జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. మక్కాలోని మద్రాకా కౌన్సిల్లో సల్మా బింట్ హిజాబ్ అల్ ఒటెబీ అనే మహిళా అభ్యర్థి విజయం సాధించినట్లు బంగ్లా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ స్థానంలో మొత్తం ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు పోటీపడగా.. సల్మా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 284 సీట్లకుగానూ.. 6వేల మంది పురుషులు, 900మంది మహిళలు పోటీపడ్డారు. తల నుంచి పాదాల వరకు మహిళలు పూర్తిగా వస్త్రంతో కప్పుకోవాలనే కఠిన నిబంధనలున్న సౌదీ అరేబియాలో తొలిసారిగా మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడమేగాక, తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అయితే ఎన్నో నిబంధనల మధ్య ఈ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థులు పురుష ఓటర్లను ఓట్లు అడగరాదనే నిబంధన ఉంది. అంతేగాక, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









