అక్కినేని కోడలా మజాకా!
- July 24, 2018
అక్కినేని కుటుంబ కోడలుగా సమంత మారిన తరువాత ఆమె తన సినిమాలను తగ్గించుకుంటుంది అని భావించారు అంతా. అయితే ఆమె తన సినిమాలను తగ్గించుకోలేదు సరికదా తన కొత్త ఆలోచనలతో అక్కినేని కాంపౌండ్ కు షాక్ ఇస్తోంది.
ప్రస్తుతం సమంత 'యూ టర్న్' లో నటిస్తోంది. ఈమూవీ మేకింగ్ విషయంలో సమంత చూపెడుతున్న శ్రద్ధను చూసి ఈమూవీ యూనిట్ సభ్యులే షాక్ అవుతున్నట్లు సమాచారం. ఈసినిమాకు సంబంధించిన మేకింగ్ ప్రమోషన్ వ్యవహారాలు అన్నీ తన గ్రిప్ లోనే ఉంచుకుంటూ 'యూ టర్న్' పేరుతో సమంత ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి తన టీమ్ లోని కీలకమైన వ్యక్తుల్ని అందులో సభ్యులుగా చేర్చుని ప్రతిరోజూ ఈసినిమాకు సంబంధించి ఖచ్చితమైన సూచనలు ఇస్తోంది అని టాక్.
ఇది చాలదు అన్నట్లుగా నాగార్జున మేనల్లుడు నటిస్తున్న సుశాంత్ 'చిలసౌ' ప్రమోషన్ విషయంలో కూడ సమంత కొత్తకొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈసినిమాకు సంబంధించి సుశాంత్ తో ఒక ప్రమోషన్ వీడియో బయటకు రావడానికి వెనుక కారణం సమంత అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కొత్తవారితో చిన్న సినిమాలు తీసే ప్లాన్ కూడ అమలచేయడం వెనుక సమంత సలహాలు ఉన్నాయి అని అంటున్నారు.
అంతేకాదు చైతూ నటిస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు' 'సవ్యసాచి' సినిమాల ప్రమోషన్ కు సంబంధించిన ప్లాన్ మొత్తం సమంత డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగచైతన్య నటించే కథలను వినే అలవాటు ఉన్న నాగార్జున ఇక రానున్న రోజులలో ఈ బాధ్యతను కూడ నాగ్ సమంతకు అప్పుచేపుతాడేమో అంటూ కొందరి కామెంట్స్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!