కుప్పకూలిన డ్యాం.. 20 మంది మృతి.. వందలాది మంది గల్లంతు
- July 24, 2018
లావోస్‌లో నిర్మాణంలో ఉన్న ఓ డ్యాం కుప్పకూలింది. వరద ధాటికి గేట్లు పడిపోయాయి. దీంతో నీళ్లు కింది ప్రాంతం వైపు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. అటేపు ప్రావిన్స్‌లోని హైడ్రోఎలక్ట్రిక్ డ్యాం కూలిపోవడంతో 6 గ్రామాలు ఆకస్మిక వరదతో మునిగిపోయాయి. దీంతో 7 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ముంచెత్తడంతో ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
క్జి నామ్‌నోయ్ డ్యాం నిర్మాణం 2013లో మొదలైంది. వచ్చే ఏడాది ఇది ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఆనకట్టలో భాగంగా నిర్మించిన 770 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తు ఉన్న సాడిల్ డ్యామ్ కూలిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వరుసగా వచ్చిన తుపాను వర్షాల వల్ల భారీ పరిమాణంలో నీటి ప్రవాహం రిజర్వాయరులోకి వచ్చిందని దీంతో నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని చెబుతున్నారు. భారీ వర్షాల వల్ల చిన్న సరఫరా ఆనకట్ట కూలిపోయిందని, ప్రధాన డ్యాం కాదని ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయిన సౌత్ కొరియా సంస్థ ఎస్.కె. ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ అధికార ప్రతినిధి తెలిపారు.
లావోస్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు.. డ్యామ్ కింది భాగంలో నివసించే ప్రజలు, పర్యావరణంపై చూపే ప్రభావాల మీద గతంలో పర్యావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. లావోస్ పీఎం సిసోలిత్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు దుస్తులు, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సాయాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!