బాంబులతో రక్తపుటేరులుగా మారుతున్న పాక్ పోలింగ్ బూత్ లు
- July 25, 2018
క్వెట్టా : పాకిస్థాన్ ఎన్నికల్లో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. రక్తపుటేరులు పారాయి. పోలింగ్ బూత్‌ను పేల్చేందుకు వెళ్లిన సూసైడ్ బాంబర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ బూత్ ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన క్వెట్టాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఆత్మహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో 22 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ బాంబర్ పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా.. బూత్ బయట ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌లో సమీపంలో పేలని గ్రనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!