తెలంగాణ టూరిజం ఆకర్షణలు

- July 25, 2018 , by Maagulf
తెలంగాణ టూరిజం ఆకర్షణలు

హైదరాబాద్: ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లోని జలపాతాలను సందర్శించే వారికి రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి బొగత, కుంటాల, పొచ్చర జలపాతాల వరకు విహారయాత్రలను ఏర్పాటుచేసింది. ఇందుకోసం బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బొగతకు రోజూ ఉదయం 7 గంటలకు బషీర్‌బాగ్ నుంచి, 7:30 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రీనివాస్ నుంచి బస్సు బయలుదేరి మధ్యాహ్నం లక్నవరం చేరుతుంది. అక్కడ పర్యాటకులు భోజనం ముగించుకుని బొగత జలపాతం వద్ద ఉల్లాసంగా గడుపవచ్చు. హరిత కాకతీయలో పర్యాటకుల డిన్నర్ ముగిసిన తర్వాత బస్సు రాత్రికి హైదరాబాద్ చేరుతుంది. ఈ యాత్రకు ఒక్కొక్కరికి ఏసీ బస్సుకు రూ.1,500, నాన్‌ఏసీ బస్సుకు రూ.1,400 చెల్లించాల్సి ఉంటుందని, భోజన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని టూరిజం కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు తెలిపారు. కుంటాల, పొచ్చర జలపాతాలను సందర్శించే వారికోసం కూడా ఇంతే రుసుముతో ఈ ప్రాంతాల నుంచే బస్సులు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలను www.telanganatourism. gov.in వెబ్‌సైట్లో పొందుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com