ట్రాఫిక్‌ సేఫ్టీ డ్రైవ్‌ చేపట్టిన షార్జా పోలీస్‌

- December 13, 2015 , by Maagulf
ట్రాఫిక్‌ సేఫ్టీ డ్రైవ్‌ చేపట్టిన షార్జా పోలీస్‌

వారాంతాల్లో పెరుగుతున్న రోడ్‌ యాక్సిడెంట్స్‌ని తగ్గించడానికి షార్జా పోలీస్‌ 'స్పెషల్‌ డ్రైవ్‌' చేపట్టింది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో వాహనదారుల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహనను పెంచనున్నారు. నేటి నుంచి ఈ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమవుతుంది. అలాగే, రోడ్లపై వాహనాలతో ఆటలు ఆడేవారిని, అతివేగంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి చట్ట పరంగా తగిన చర్యలు తీసుకుంటామని షార్జా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ట్రాఫిక్‌ మరియు పెట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ షవాప్‌ అబ్దుల్‌ రెహమ్మాన్‌ చెప్పారు. 2015లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగాయనీ, ఈ ప్రమాదాల్లో చాలామంది చనిపోయారనీ, 2014తో పోల్చి చూస్తే ఈ ప్రమాదాలు చాలా ఎక్కువని పోలీసులు అన్నారు. వారాంతాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లుగా షార్జా పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతి వేగం, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్‌ ప్రమాదాలకు కారణమని షార్జా పోలీసులు చెప్పారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com