ఆగస్టు 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
- July 25, 2018
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి మధ్యాహ్నా భోజన పథకం అమలు కానుంది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్దాస్ బుధవారం విడుదల చేశారు. ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,74,683 విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది. 331 జూనియర్ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశా లల నుంచి అందిస్తారు. ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంట శాలలు, ఎన్జీవోలకు ప్రభుత్వం అప్పగించనుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..