మారుతి 'బ్రాండ్ బాబు' ట్రైలర్ విడుదల
- July 26, 2018
ఒకప్పుడు యూత్ కథా చిత్రాలని తెరకెక్కించే మారుతి ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలని కూడా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలకి అశేష ఆదరణ లభిస్తుంది. దర్శకుడిగా పలు చిత్రాలు చేస్తూనే ఇతరుల సినిమాలకి కథలు కూడా అందిస్తున్నాడు మారుతి. తాజాగా ఆయన బ్రాండ్ బాబు అనే చిత్రానికి కథ అందించారు. సుమంత్ శైలేంద్ర .. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రభాకర్.పి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో సినిమాపై భారీ ఆసక్తి కలిగేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేసిన టీం కొద్ది సేపటి క్రితం నాగ చైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయించారు. ట్రైలర్లో సన్నివేశాలు సరదాగా కనిపించాయి. ఏ వస్తువులోనైన బ్రాండ్ చూసే అబ్బాయి పెళ్లి విషయంలో మాత్రం టీ స్టాల్ నడుపుకునే అమ్మాయి ప్రేమలో పడతాడని ట్రైలర్‌ని బట్టి అర్ధమవుతుంది. ఈ చిత్రం అటు యూత్ ఇటు ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇందులో మురళీశర్మ కీలకమైన పాత్ర పోషిస్తుండగా, రాజారవీంద్ర .. 'సత్యం'రాజేశ్ ..
పూజిత పొన్నాడ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. 'బ్రాండ్ బాబు' ద్వారా హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతోన్న సుమంత్ శైలేంద్రకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!