మలేషియా:తెలంగాణ ప్రవాసుల కోసం హెల్ప్ లైన్
- July 26, 2018
కౌలాలంపూర్ : మలేషియాలోని కౌలాలంపూర్ బ్రిక్ ఫీల్డ్స్ పామ్ కోర్ట్ హాల్లో మలేషియా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మలేషియా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బీగాల సలహా మేరకు హెల్ప్ లైన్ను (006010-778 1103) ప్రారంభించారు. మలేషియా ప్రవాసీ తెలంగాణ వాసులు ఎదురుకొంటున్న సమస్యలను ఈ హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయాలని వైస్ ప్రెసిడెంట్ కుర్మా మారుతీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత, వైస్ ప్రెసిడెంట్ మారుతీ కుర్మ, జనరల్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, ఇతర కోర్ కమిటీ సభ్యులు బొడ్డు తిరుపతి, గౌరు రమేష్, బోయేని శ్రీనివాస్, గద్దె జీవన్ కుమార్, నడిపెళ్లి సత్యనారాయణరావు, మునిగల అరుణ్ కుమార్, రవీందర్ రెడ్డి తెరాస సభ్యులు రసూల్, సంతోష్, హరీష్ , కోటి, మహిళా సభ్యులు రజిత, స్వాతి, శాన్విత, స్వప్న, సౌజన్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!