రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటి
- July 27, 2018
బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పర్యటనకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటి అయ్యారు. రష్యాతో మాకు మంచి అనుబంధం ఉంది. విభిన్న రంగాల్లో మా స్నేహం కొనసాగుతుంది. బహుళ రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాము అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల నేతల ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, శక్తి, రక్షణ మరియు పర్యాటక రంగం వంటి అంశాలపై లోతుగా చర్చించినట్లు విదేశాంగ ప్రతినిధి రావీష్ కూమార్ ట్విటర్లో తెలిపారు. కాగా ప్రపంచ జనాభాలో 40 శాతం ఉన్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పరస్పర సహాకారం కొరకు 2009లో బ్రిక్స్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిక్స్ పదో శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరం ఆతిథ్యం ఇస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!