గార్బేజ్‌ ట్రక్‌ బోల్తా: క్లీనర్‌ దుర్మరణం

- July 27, 2018 , by Maagulf
గార్బేజ్‌ ట్రక్‌ బోల్తా: క్లీనర్‌ దుర్మరణం

కువైట్‌: కువైట్‌ ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టరేట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం గార్బేజ్‌ ట్రక్‌ ఒకటి బోల్తా పడటంతో ఆసియాకి చెందిన క్లీనర్‌ మృతి చెందగా, మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. దాహెర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఘటనలో అగ్ని ప్రమాదం కారణంగా ఓ మహిళ గాయపడింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌మెన్‌, అపార్ట్‌మెంట్‌ నుంచి జనాల్ని ఖాళీ చేయించారు. ఈ ఘటనలో 18 ఏళ్ళ అరబ్‌ వలస మహిళ గాయపడ్డారు. ఆమెను తక్షణం ముబారక్‌ హాస్పిటల్‌లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com