30న నీవెవరో మూవీ సాంగ్ రిలీజ్..

- July 28, 2018 , by Maagulf
30న నీవెవరో మూవీ సాంగ్ రిలీజ్..

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ప్రధాన పాత్రల్లో తెరకెక్కెతున్న మూవీ నీవెవరో. రచయిత కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.. హరినాధ్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.. ఈ మూవీలో ఆది అంధుడిగా కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ కన్నడ మూవీ అదే కంగల్ కు రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో కలైయారసన్‌ హరికృష్ణనన్‌ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ లోని ఓహో చెలి సాంగ్ ను ఈ నెల 30వ తేదిన సీనియర్ నటుడు మాధవన్ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.. ప్రసేన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com