రెండో పెళ్లి ..సౌదీ అరేబియాకి ఉడాయించిన భర్త
- July 28, 2018
తెలంగాణ:భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొని సౌదీకి ఉడాయించడంతో బాధితురాలు, బంధు వులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ఎదుట శనివారం టెం టు వేసి నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలు అమినా వివరాల ప్రకారం... హన్మకొండలోని మహ్మద్ హుస్సేన్‌ఖాన్, సయిదా దంపతుల కుమార్తె అమినాకు వరంగల్ ఎల్బీనగర్ ప్రాం తానికి చెందిన మహ్మద్ అజార్, సిరాజ్‌బేగం దంపతుల కుమారుడు మహ్మద్ నజీమ్‌తో 2015 నవంబర్‌లో రూ.10లక్షల కట్న కానుకల తో వివాహం జరిగింది.
కొన్ని నెలల క్రితం భార్యను పుట్టింటికి పం పి రెండు నెలల క్రితం మరో యువతిని వివా హం చేసుకుని సౌదీకి ఉడాయించాడని ఆరోపి స్తూ ఎల్బీనగర్లోని నజీమ్ ఇంటి ఎదుట బాధితురాలు అమినా, కుటుంబసభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. మహిళా సంఘాల నేతలతో కలిసి ఇంటి ఎదుట టెంట్ వేసి నిరసన వ్యక్తంచేశారు. ఈక్రమంలో ఇరు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీయడంతో ఇంట్లో ఉన్న నజీమ్ తండ్రి అజార్‌పై దాడికి యత్నించారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ మహిళా నాయకురాలు రహమున్నీసా మాట్లాడుతూ కట్నం కోసం చిత్రహింసలు పెట్టడం హేయమైన చర్యఅన్నారు.అమినాకు న్యాయం జరిగేవరకు వెనుతిరిగేది లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..