హైదరాబాద్:9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు
- July 29, 2018
హైదరాబాద్: ఆగస్టు 9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి వంటి కార్యక్రమాలను విశ్వకర్మలు చేపట్టాలని విశ్వకర్మ సంఘం కార్పొరేషన్ పాలకమండలి రాష్ట్ర అధ్యక్షుడు కాతోజు రామాచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వకర్మ కార్పొరేషన్ పాలకమండలి సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం జరిగింది. సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడారు. స్వీడన్ దేశానికి చెందిన ఐకియా ఫర్నీచర్ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆగస్టు 9న ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ కంపెనీ వల్ల లక్షలాది మంది విశ్వకర్మలు వృత్తి కోల్పోయి ఉపాధి లేక రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. ఐకియా కంపెనీని ఏర్పాటు చేస్తే అందులో 90 శాతం ఉద్యోగాలు విశ్వకర్మలకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వి.వేణుగోపాల్ చారి, రుద్రోజు శివలింగం, నాగార్జున మధుసూదనాచారి, సాయిబాబు, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా