స్విగ్గీ బంపర్ ఆఫర్..

- July 31, 2018 , by Maagulf
స్విగ్గీ బంపర్ ఆఫర్..

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. స్విగ్గీ సూపర్ పేరిట అందుబాటులోకి రానున్న ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు స్విగ్గీలో మెంబర్‌షిప్ తీసుకుంటే దాంతో వారికి ఉచితంగా ఫుడ్ డెలివరీలు లభిస్తాయి. 3 నెలల కాలానికి గాను స్విగ్గీ మెంబర్‌షిప్‌ను అందించాలని చూస్తున్నది. ఈ మెంబర్‌షిప్ రుసుము రూ.99 నుంచి రూ.149 మధ్య ఉంటుందని తెలిసింది. ఇందులో 2 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోవాలని స్విగ్గీ ఆలోచిస్తున్నది. ఇప్పటికే 7 పట్టణాల్లో పరిమిత సంఖ్యలో పలువురు కస్టమర్లకు స్విగ్గీ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నది. ప్రస్తుతం ఈ మెంబర్‌షిప్ ఆఫర్ ప్రయోగాత్మక దశలో ఉంది కానీ అతి త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని తెలిసింది. కాగా ఫుడ్ డెలివరీ యాప్‌ల పరంగా చూస్తే ఇతర యాప్‌ల నుంచి స్విగ్గీ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నది. మరి ఈ మెంబర్‌షిప్ ప్రయోగం స్విగ్గీకి ఎంత వరకు సక్సెస్‌ను ఇస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com