నేటి నుంచి యూఏఈలో క్షమాభిక్ష

- July 31, 2018 , by Maagulf
నేటి నుంచి యూఏఈలో క్షమాభిక్ష

యూఏఈ:ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి.. ఖల్లివల్లి అయిన వలసకార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం సదవకాశం కల్పించింది. వీసా, వర్క్ పర్మిట్‌లేకుండా అక్రమంగా ఉంటున్న (ఖల్లివల్లి) కార్మికుల నుంచి జరిమానాలు వసూలు చేయకుండా, జైలుశిక్ష విధించకుండా స్వదేశాలకు పం పించనున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబ ర్ 31 వరకు క్షమాభిక్షను అమలుచేయనున్నట్టు వెల్లడించింది. 2013లో రెండునెలలపాటు క్షమాభిక్షను అమలుచేసిన యూఏఈ ప్రభుత్వం, ఐదేండ్ల తర్వాత మూడునెలలు క్షమాభిక్ష ప్రకటించడం గమనార్హం. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్ అనే కార్యక్రమం పేరిట క్షమాభిక్షను అమలుచేయనున్నది. యూఏఈలో సుమారు 20 వేల మంది తెలంగాణ కార్మికులు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సుమారు 5 వేల మంది ఖల్లివల్లి అయి ఉంటారని అంచనా. ఖల్లివల్లి కార్మికులకు అక్కడి చట్టాల ప్రకారం భారీ జరిమానాలు, జైలు శిక్ష విధిస్తుంటారు. దీంతో అనేకమంది స్వదేశాలకు చేరుకోలేక అక్కడి జైళ్లలోనే మగ్గుతూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్నది.

ఇరు రాష్ట్రాల మంత్రులు వలసకార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పడు గల్ఫ్ దేశాలతో సంప్రదింపులను కూడా జరుపుతున్నారు. తాజాగా యూఏఈ దేశాల్లో ఉన్నవారిని గుర్తించి స్వదేశానికి తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com