కారు దొంగతనం: ఇద్దరి అరెస్ట్‌

- August 01, 2018 , by Maagulf
కారు దొంగతనం: ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో కార్లను దొంగిలించారంటూ ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి. విలాయత్‌ అఫ్‌ ఆమెరాత్‌లోని అల్‌ డోకుల్‌లో కారు దొంగిలిస్తుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్ల దొంగతనాలకు సంబంధించి పలు ఫిర్యాదులు రావడంతో, రంగంలోకి దిగిన సెర్చ్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా నిందితుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. మరో ఘటన రువిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని అరెస్ట్‌ చేసి, దొంగతనాల కోసం వినియోగిస్తున్న కారుని స్వాధీనం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com