మహీంద్రాలో ఉద్యోగావకాశాలు
- August 06, 2018
న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర టెకీలకు శుభవార్త చెప్పింది. రాబోయే మూడు త్రైమాసికాల్లో సంస్థ ఉద్యోగులను పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్టు చెప్పింది. దాదాపు నాలుగు వేలమంది కొత్త ఉద్యోగాలను అదనంగా జోడించుకోవాలని చూస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,800 మందిని నియమించు కున్నట్లు వెల్లడించింది. వచ్చే తొమ్మిది నెలలకాలంలో 4వేల మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు. జూన్ 2018 నాటికి కంపెనీలో 1,13,552 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో సాఫ్ట్‌వేర్ నిపుణుల సంఖ్య 72,462.. బీపీఓ విభాగంలో 34,700 మంది ఉద్యోగులు, సేల్స్‌లో 6,390 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. డిమాండ్ ఆధారిత నియామకంపై మరింత దృష్టి పెట్టినట్టు టెక్ మహీంద్ర ప్రధాన ఆర్థిక అధికారి మనోజ్ భట్ తెలిపారు.
తాజా వార్తలు
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!







