అమెరికాలో 6.4 పాయింట్ల తీవ్రతతో భూ కంపం

- August 12, 2018 , by Maagulf
అమెరికాలో 6.4 పాయింట్ల తీవ్రతతో భూ కంపం

అగ్ర రాజ్యం అమెరికాలోని ఉత్తర అలస్కా ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వే ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు ఇంకా సమాచారం అందలేదు.ఇంత తీవ్రతతో భూకంపం సంభవించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. భూకంపం సంభవించిన తర్వాత పలుమార్లు ప్రకంపనలు కూడా వచ్చాయని జియోగ్రాఫికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com