పంద్రాగస్టున వరుణ్ తేజ్ స్పేస్ మూవీ టైటిల్
- August 13, 2018
వరుణ్ తేజ్.. అంతరిక్షం నేపథ్యంలో సాగే ఓ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది వరుణ్ తొలి అంతరిక్షం సినిమా. వ్యోమగామి పాత్రలో వరుణ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ని ఆదివారం విడుదలచేశారు. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ఆగస్టు 15న 9:30 గంటలకు ప్రకటించబోతున్నారని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్ పెడతారని ప్రచారంలో ఉంది.
అంతరిక్షంలో ఉపగ్రహానికి దగ్గరగా వెళ్తున్న వ్యోమగామి ఫోటోను వరుణ్ ఈ సందర్భంగా పోస్టు చేశారు. హాలీవుడ్ స్థాయిలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో, ఇతర నటులు జీరో గ్రావిటీపై ప్రత్యేక శిక్షణ తీసుకొని నటించారని మూవీ యూనిట్ తెలిపింది. వరుణ్‌తేజ్ సరసన అదితీరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అనే సినిమా కూడా చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!