ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ కన్నుమూత
- August 14, 2018
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్(90) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన టాండన్‌ను చికిత్స నిమిత్తం ఇవాళ ఉదయం రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టాండన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్ టాండన్ మృతిపట్ల ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జనసంఘ్ స్థాపించిన సభ్యుల్లో టాండన్ కూడా ఒకరు. బీజేపీలో ఆయన కీలక పదవుల్లో పని చేశారు. పంజాబ్ కు డిప్యూటీ సీఎంగా కూడా సేవలందించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ గా 2014, జులైలో నియామకం అయ్యారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్