స్వేచ్ఛ
- August 15, 2018హితులో
సన్నిహితులో
అయినవాళ్ళదగ్గర ఐదు నిముషాలైనా
అచ్చంగా బతకలేని స్వచ్ఛంగా నిలువలేని నీడలు కొన్ని
తల్లీ .. అని మొసలి కన్నీరు కార్చుతూ మట్టిని తడిపేస్తాయి
ఏడాదికి ఒకటి రెండుసార్లు కురిసే రెండు మూడు చినుకుల్లో
నువ్వూ తడిసిపోతావు .
మూడు రంగుల్లో మురిసిపోతావు.
గాలికేం స్వేచ్ఛగానే వీస్తున్నది
అడ్డుగోడ లేని మేఘాలు అందంగానే కదులుతున్నాయి
ఆకాశంలో బొమ్మలను గీసుకుంటూ, మునుపటి లాగే
దేశమా ....నీకు తెలియనిదేముంది !
బతికినోళ్ళెందరో సచ్చిపోయారు
సచ్చినోళ్ళు కొందరైనా బతికున్నారు
ఉన్నోల్లే చస్తూ బతుకుతున్నారు.
అయినా...గాలికేం స్వేచ్ఛగానే వీస్తున్నది .
పారువెల్ల
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!