రాహుల్ అధ్యక్షతన వార్‌రూమ్‌లో కీలక సమావేశం

- August 18, 2018 , by Maagulf
రాహుల్ అధ్యక్షతన వార్‌రూమ్‌లో కీలక సమావేశం

ఢిల్లీ: రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వార్‌రూమ్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. రాఫెల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, కేరళలో సహాయక చర్యలపై కాంగ్రెస్ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ పెద్ద దోపిడీ దారుడని మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణను ఫణంగా పెట్టి రిలయన్స్ కంపెనీకి దోచిపెట్టారని అన్నారు. బీజేపీ అవినీతిని బయటపెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాఫెల్ కుంభకోణంపై అక్టోబర్‌లో కరపత్రాలను పంచుతామని రఘువీరా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com