ఫిజీ:భారీ భూకంపం.. భయంతో పరుగులు
- August 18, 2018
దక్షిణ పసిఫిక్ సముద్రంలో దీవుల సమూహమైన ఫిజీలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపంతో పెద్దగా ప్రమాదం లేదని.. పైగా అందరు అనుకుంటున్నట్టు సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఫిజీ కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడం మొదలైందని దాంతో ఇళ్ళలో ఉన్న స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే కొన్నిచోట్ల భూకంపం దాటికి పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్