కేరళను ఆదుకోండి.. పోప్ ఫ్రాన్సిస్‌

- August 19, 2018 , by Maagulf
కేరళను ఆదుకోండి.. పోప్ ఫ్రాన్సిస్‌

వరదలకు ఘోరంగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు పోప్ ఫ్రాన్సిస్‌. ఇవాళ వాటికన్ సిటీలో జరిగిన వారాంతపు ఆదివారం ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ వరదల్లో మరణించినవారి కోసం ప్రార్థన చేయాల్సిందిగా వాటికన్ స్క్వేర్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని కోరారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు క్యాథలిక్ చర్చి చర్యలు తీసుకొంటోందని పోప్ వెల్లడించారు. ఈ విషాద సమయంలో అంతర్జాతీయ సమాజం భారత్‌కు అండగా నిలవాలని, వరదల్లో దెబ్బతిన్నవారికి సాయం చేయాలని ఆయన కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com