యెమెన్:చిన్నారులను బలితీసుకున్నది అమెరికా బాంబే
- August 19, 2018వాషింగ్టన్: యెమెన్‌లో శనివారం నాడు ఒక స్కూల్బస్పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఉపయోగించిన బాంబు అమెరికా తయారు చేసినదేనని నిపుణులు స్పష్టం చేశారు. సౌదీతో కుదుర్చుకున్న ఆయుధాల ఒప్పందంలో భాగంగా ఈ బాంబును అమెరికా విక్రయించిందన్నారు. అమెరికా రక్షణ కాంట్రాక్ట్ సంస్థల్లో ఒకటైన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ 227 కేజిల లాజెర్ గైడెడ్ ఎంకె-82 తరహా బాంబును ఈ నెల 9న సంకీర్ణ దళాలు ప్రయోగించటంతో పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 2016 అక్టోబర్‌లో ఒక కార్యక్రమంపై జరిగిన దాడిలో వినియోగించిన బాంబు వంటిదేనని నిపుణులు తేల్చిచెప్పారు. ఈ దాడిలో 155 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయాల పాలైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..