బ్యాంకాక్ లో నాని-రష్మిక ల సినిమా షూటింగ్

- August 20, 2018 , by Maagulf
బ్యాంకాక్ లో నాని-రష్మిక ల సినిమా షూటింగ్

అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా "దేవదాస్". "భలే మంచి రోజు" "శమంతకమణి " వంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో, నాని డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. "మళ్ళిరావా" ఫేమ్ అయినా ఆకాంక్ష సింగ్ నాగ్ సరసన నటిస్తుండగా, నాని సరసన రష్మిక నటిస్తోంది.

ఇప్పటికే సగంకి పైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో నాని, రష్మికలపై కొన్ని సన్నివేశాలను ఒక పాటను చిత్రికరిస్తోంది చిత్రబృందం. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తోంది చిత్ర బృందం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com