కేరళీయులను కాపాడిన వారికి 3వేలు ఇస్తామంటే, తిరస్కరించిన మత్స్యకారులు

- August 21, 2018 , by Maagulf
కేరళీయులను కాపాడిన వారికి 3వేలు ఇస్తామంటే, తిరస్కరించిన మత్స్యకారులు

తిరువనంతపురం: కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఆరెస్సెస్‌తో పాటు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. సహాయం చేస్తున్న వారికి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రివార్డు ఇస్తామని చెప్పగా, వారు సున్నితంగా తిరస్కరించారు.

వరదలలో చిక్కుపోయిన వారిని మత్స్యకారులు కూడా ప్రాణాలతు తెగించి కాపాడుతున్నారు. అలా సాయం చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.3000 ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే దానిని మత్స్యకారులు తిరస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఫోర్ట్ కొచ్చికి చెందిన మత్స్యకారుల నాయకుడు ఖాయాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమను ప్రశంసించడం ఆనందంగా ఉందని చెప్పారు. నేను, నా మిత్రులు ఎంతోమందినికాపాడామని చెప్పారు. తమను సహాయం అందించిన వారి పాలిట ఆర్మీలా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు.

తమ సహాయానికి గాను ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తామని చెప్పినట్లుగా విన్నామని, అది తమను బాధించిందని, ఎందుకంటే మేం డబ్బుల కోసం ఆ పని చేయలేదన్నారు. తోటి వారి ప్రాణాలు కాపాడినందుకు తమకు డబ్బులు అవసరం లేదని చెప్పారు. నష్టపోయిన తమ పడవలను ప్రభుత్వం బాగు చేయిస్తానని చెప్పిందని, అందుకు అందరం సంతోషంగా ఉన్నామని చెప్పారు. తాము మానవత్వంతో సాయం చేశామన్నారు. మా సాయానికి వెలకట్టవద్దన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com