అమెరికా వ్యాప్తంగా ఖైదీల సమ్మె ప్రారంభం
- August 22, 2018
వాషింగ్టన్ : అమెరికా జైళ్ళలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖైదీలు మంగళవారం నుండి 19 రోజుల పాటు సమ్మె ప్రారంభించారు. జైళ్ళలో అమానవీయ పరిస్థితుల పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బానిస తరహాలో తమ చేత పనులు చేయించుకుంటున్నారని, పైగా రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన హక్కులను తొలగిస్తున్నారని వారు ఆందోళన వెలిబుచ్చారు. జైళ్ళలో తమ పరిస్థితులను సవాలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 'జైల్‌హౌస్ లాయర్స్ స్పీక్' అనే జైలు సంస్థ ఈ సమ్మెకు నాయకత్వం వహించింది. ఇటీవల దక్షిణ కరోలినాలో లీ కరెక్షనల్ ఇనిస్టిట్యూషన్‌లో ఘర్షణలు జరిగి ఏడుగురు ఖైదీలు మరణించగా, 17మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో ఈ సమ్మె ప్రారంభించారు. దారుణ పరిస్థితులకు పెట్టింది పేరైన ఈ జైల్లో గంటల తరబడి హింసాకాండ కొనసాగినా సిబ్బంది పట్టించుకోలేదు. గాయపడిన వారికి చికిత్స కూడా అందలేదు. దీంతో నిరసన తెలిపిన ఖైదీలు ముందుగా తమ పనులను విరమించి నిరసన తెలియచేశారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!