ప్రముఖ జర్నలిస్ట్ మృతికి ప్రధాని సంతాపం
- August 23, 2018
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్, రచయిత కుల్దీప్ నాయర్ మృతిచెందారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సిల్కోట్లో 1923 ఆగస్ట్ 4లో జన్మించారు. లా డిగ్రీ పట్టాను దేశ విభజనకు ముందు లాహోర్ నుండి పొందారు. ' బిట్వీన్ ద లైన్స్' పేరుతో కాలమ్ దాదాపు 80 పత్రికలలో ప్రచురితమైంది. జర్నలిస్ట్‌గానే కాక మానవహక్కుల ఉద్యమకారుడిగగా కుల్దీప్ బాధ్యతలు నిర్వహించారు. 1990లో బ్రిటన్‌లో హైకమిషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన ఆత్మకథ 2012లో ప్రచురితమైంది. విభజన అనంతరం కమ్యూనిటీల మధ్య నమ్మకాలు కూలిపోవడాన్ని గురించి రచించారు. దేశ విభజన సమయంలో పంజాబ్ నుండి ఆయన బలవంతంగా ఢిల్లీకి చేరుకున్నారు.
కుల్దీప్ నాయర్ తమ కాలానికి చెందిన మేధో దిగ్గజమని, నిర్భయమైన తన అభిప్రాయాలతో అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్‌గా కొనసాగారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఆయన చూపిన ధైర్యం, ప్రజలకు సేవచేయడం, మెరుగైన దేశం కోసం ఆయన చూపిన నిబద్ధత ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయని, ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!