'సర్కార్' సినిమా ఆడియో వేడుకకి వేదిక ఫిక్స్
- August 24, 2018
చెన్నై:ఇలయదళపతి విజయ్‌కి తమిళంలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఇటీవల మెర్సల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఈ చిత్రంతో కాస్త నిరాశపరచాడు. దీంతో అభిమానులు విజయ్ తదుపరి సినిమాపై చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ తన 62వ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
విజయ్ బర్త్ డే(జూన్ 22) సందర్భంగా ఆయన 62వ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సర్కార్ పేరుని మూవీ టైటిల్‌గా ఫిక్స్ చేసి, ఆయన సినిమాకి సంబంధించి పోస్టర్స్ విడుదల చేశారు. అవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా చిత్ర టీజర్ విడుదలకి ప్లాన్ చేశారు. దీనిపై త్వరలో అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్ర ఆడియో వేడుకని అక్టోబర్ 2న చెన్నై లో గ్రాండ్ గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ 62వ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
దీపావళి కానుకగా ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. తుపాకి, కత్తి వంటి చిత్రాలు విజయ్ - మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కి మంచి విజయం సాధించగా, తాజా చిత్రంతో హ్యట్రిక్ కొడతారని అభిమానులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి