జమారత్పై 166 మిలియన్ రాళ్ళు
- August 24, 2018
మినా:గురువారం సాయంత్రం నాటికి 166,07,250 రాళ్ళను జమరాత్పైకి విసిరారు హజ్ ఫిలిగ్రిమ్స. 'స్టోనింగ్ ఆఫ్ ది డెవిల్' కార్యక్రమంలో భాగంగా తొలి రెండ్రోజుల్లో 1.6 మిలియన్ ఫిలిగ్రిమ్స్ రాళ్ళను విసిరారు. గ్రాండ్ మాస్క్‌లో తవాఫ్ ప్రేయర్స్ నిర్వహించిన ఫిలిగ్రిమ్స్, 'సైతాన్'పై రాళ్ళు విసరడం ఆనవాయితీ. ఈ ఏడాది 2,371,675 మంది ఫిలిగ్రిమ్స్ హజ్ యాత్రను నిర్వహించారు. వీరిలో 1,758,722 మంది విదేశాలకు చెందినవారు కాగా, కింగ్డమ్కి చెందిన 612,953 మంది ఉన్నారని కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కల్నల్ తారిక్ అల్ ఘబ్బామ్ చెప్పారు. మొదటి రెండ్రోజులు సైతాన్‌పై రాళ్ళు విసిరిన ఫిలిగ్రిమ్స్ మూడో రోజు కూడా అదే పని చేయాల్సిన అవసరం లేదనీ, వీలైనంత త్వరగా మినాని విడిచి వెళ్ళాల్సి వుంటుందని ఆయన వివరించారు. తష్రీక్ మూడో రోజున మిగిలిన ఫిలిగ్రిమ్స్, జమరాత్పై రాళ్ళను విసురుతారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!