లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాహుల్ ప్రసంగం
- August 25, 2018
లండన్: భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్ని బీజేపీ, ప్రతిపక్షాల ఐక్య కూటమి మధ్య పోరుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం రాత్రి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు. బీజేపీని ఓడించడం, ప్రభుత్వ సంస్థల్లో ఆర్ఎస్ఎస్ జోక్యాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష కూటమి మధ్య ముఖాముఖి పోరు తథ్యం’ అని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..