ఫ్లోరిడాలో కాల్పులు... ముగ్గురు మృతి..
- August 26, 2018ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాక్సన్‌విలేలో జరిగిన కాల్పుల ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక అనుమానితుడు కూడా మృతిచెందాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని, 11 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. కాగా జాక్సన్ విలె కార్యాలయం ఒక ట్వీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపింది. 'ఈ కాల్పుల ఘటనలో చాలా మంది మృతి చెందారు. మరికొంతమందిని అక్కడి నుంచి తీసుకుపోయారు. సంఘటనా స్థలానికి అందరూ దూరంగా ఉండండి' అని పేర్కొంది. కాగా అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక వీడియో గేమ్ టోర్నమెంట్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలంలో మోహరించి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ