మహిళ హత్య కేసు: ఒకరి అరెస్ట్‌

- August 26, 2018 , by Maagulf
మహిళ హత్య కేసు: ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: వలస మహిళను హత్య చేసిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బార్కాలో ఈ అరెస్ట్‌ జరిగింది. కారు పైకెక్కించి నిందితురాలు హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అరబ్‌ మహిళను నిందితురాలు హత్య చేసింది. విలాయత్‌ ఆఫ్‌ బర్కాలోని అల్‌ రుమైస్‌ ప్రాంతంలో గల ఓ ఫామ్‌ వద్ద ఈ హత్య జరిగింది. కారు ఎక్కించి, మహిళను చంపేసిన అనంతరం నిందితురాలు కారుతో సహా అక్కడి నుంచి ఉడాయించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. 
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com