పాకిస్తాన్:విమానాశ్రయాల్లో వీఐపీ ప్రొటోకాల్‌పై నిషేధం

- August 27, 2018 , by Maagulf
పాకిస్తాన్:విమానాశ్రయాల్లో వీఐపీ ప్రొటోకాల్‌పై నిషేధం

పాకిస్తాన్:పొదుపు చర్యలకు ప్రాధాన్యమిస్తూ పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా సరే బిజినెస్‌ క్లాస్‌లోనే ప్రయాణించాలని నిర్ణయించగా.. తాజాగా విమానాశ్రయాల్లో వీఐపీ సంప్రదాయంపై నిషేధం తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టులో ఏ అధికారి అయినా వీఐపీ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నట్లు కన్పిస్తే సదరు అధికారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. అవసరమైతే వారిని విధులను తొలగిస్తామని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com