యూఏఈ లో ఓనమ్‌ రద్దు: వెలవెలబోతున్న టన్నుల కొద్దీ పూలు

- August 27, 2018 , by Maagulf
యూఏఈ లో ఓనమ్‌ రద్దు: వెలవెలబోతున్న టన్నుల కొద్దీ పూలు

యూఏఈ:యూఏఈలో పూల దుకాణాలు వెలవెలబోతున్నాయి వినియోగదారులు లేకపోవడంతో. కేరళలో వరదల కారణంగా విపరీతమైన నష్టం సంభవించడంతో యూఏఈలోని కేరళ సమాజం ఓనమ్‌ వేడుకలకు దూరంగా వుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరూ పూలు కొనేందుకు ముందుకు రావడంలేదు. పెరుమాల్‌ స్టోర్స్‌ అనే ఓ ఫ్లవర్‌ స్టోర్‌లో 3 టన్నుల పూలు వృధా అయ్యాయి. వాటిని వేస్ట్‌గా పారేయాల్సి వచ్చిందని పెరుమాల్‌ స్టోర్స్‌ అధినేత సుదాలైముత్తు పెరుమాల్‌ చెప్పారు. రోజెస్‌, మారీ గోల్డ్‌, హిబికస్‌, తులసి, లాంతన తదితర పూలను ఓనమ్‌ ఫెస్టివల్‌లో ప్రముఖంగా ఉపయోగిస్తారు. 'అతపోకలం' పేరుతో ఏర్పాటు చేసే పూల అమరిక ఓనమ్‌కి ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి యేడాదీ 15 టన్నులకు పైగా పూలను ఓనమ్‌ కోసం సిద్ధం చేస్తామనీ, ఈసారి ఆ పరిస్థితి లేదనీ, చివరి నిమిషంలో ఓనమ్‌ రద్దుపై ప్రకటన రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని పెరుమాల్‌ స్టోర్‌ అధిపతి వెల్లడించారు.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com