జింబాబ్వే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎమెర్సన్ మనంగఁగ్వా
- August 27, 2018
హరారే: జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమర్సన్ మంగాగ్వే ఆదివారం నాడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ప్రధానన్యాయమూర్తి లూక్ మలాబా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మంగగ్వా తాను దేశ రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు కట్టుబడి, విశ్వాసపాత్రుడిగా దేశానికి సేవలందిస్తానని ప్రమాణం చేశారు. మంగగ్వా ఎన్నికను సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత నెల్సన్ చమిసా దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసిన తరువాత మంగగ్వా ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో మంగగ్వాకు 50.67 శాతం ఓట్లు, ప్రత్యర్థి చమిసాకు 44.3 శాతం ఓట్లు లభించాయని జింబాబ్వే ఎన్నికల కమిషన్ తన తుది ఫలితాల ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!