అమెరికా ఆంక్షలపై అంతర్జాతీయ కోర్టులో సవాల్
- August 28, 2018
ది హేగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడువారాల క్రితం విధించిన ఆంక్షలపై ఇరాన్ అంతర్జాతీయ కోర్టులో అమెరికాకు వ్యతిరేకంగా వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. 2015 లో ఇరాన్‌తో చారిత్రక ఒప్పందం చేసుకొని అంక్షలను ఎత్తి వేసిన అమెరికా మళ్లీ ఆ దేశంపై కఠినమైన ఆంక్షలను విధించింది. ఇరాన్ పై అమెరికా అంక్షలు విధించడంపై ఆ దేశం హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ రెండు దేశాల మధ్య న్యాయ పోరాటం మొదలైంది. ఇవి నవంబర్ నుంచి అమలులోకి వస్తాయని, ఆ దేశ విలువైన సంపదయైన క్రూడాయిల్ పై ప్రభావం పడుతుంది. టెహ్రాన్ గత జులై లోనే కేసువేసి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాడుతోంది. అంక్షలను ఎత్తివేయమని హేగ్ లోని ట్రిబ్యునల్ జడ్జీలను కోరింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడుకొన్నదని ఆ దేశం ఆరోపించింది. అమెరికాకు ఆంక్షలను విధించే హక్కు లేదని, దీనివలన తమకు సంభవించిన నష్టానికి నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం 1946 లో రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి కొన్ని నియమాలను ప్రవేశపెట్టింది. అయితే టెహ్రాన్ యొక్క విన్నపాన్ని పరిశీలించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.తుది తీర్పు వెలువడటానికి సంవత్సరాలు పట్టవచ్చు.
ఆ ఒడంబడికను విడిచిపెట్టాలని మిగితా పార్టీలు కోరిన ట్రంప్ వాటిని పట్టించుకొనక ఇరాన్‌పై అంక్షలు విధించారు. ఈ కొత్త అంక్షల వలన ఆర్థిక వృద్ధి మందగించిందని, ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ సగానికి సగం పడిపోయిందని వారు వాపోయారు, వీటి వలన ఇరాన్‌లోని అంతర్జాతీయ కంపెనీలైన టోటల్, రెనాల్ట్ (ఫ్రాన్స్),సీమెన్స్, దైమ్లర్ (జర్మనీ) వాటి తయారీని నిలిపివేస్తాయని తెలిపారు. ఎయిర్ ప్రాన్స్,బ్రిటీష్ ఎయిర్వేస్ ఈ రెండు సంస్థలు వచ్చే నెల నుంచి ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపి వేస్తామని సంయుక్తంగా ప్రకటించారు. గతంలోనే ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమైనీ యు.ఎస్.తో యుద్ధం లేదు, మాటల్లేవని ప్రకటించారు.ఈ వ్యాజ్యానికి సంబంధించి వాషింగ్టన్ న్యాయవాదులు మంగళవారం హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..