ట్విట్టర్ నుంచి కొన్ని ఖాతాలు సస్పెండ్

- August 28, 2018 , by Maagulf
ట్విట్టర్ నుంచి కొన్ని ఖాతాలు సస్పెండ్

గతవారం 284 అకౌంట్లపై కొరడా ఝళిపించిన ట్విట్టర్ ఇప్పుడు మరిన్ని ఆకౌంట్లను సస్పెండ్ చేసింది. అకౌంట్లు తారుమారు చేశారని తాజాగా 486 అకౌంట్లను క్లోజ్ చేసింది. దీంతో మొత్తం 770 అకౌంట్లను ట్విట్టర్ సస్పెండ్ చేసినట్లైయింది. గత వారం ఇరాన్ ట్విట్టర్ పలు అకౌంట్లను తొలగించింది. తాజాగా యూఎస్ లో కూడా సుమారు 100 నకిలీ అకౌంట్లను సస్పెండ్ చేసింది. తొలగించిన వారిలో అధికంగా ఏడాది వయస్సు కన్న తక్కువ ఉన్నవారే ఈ వంద అకౌంట్లు మొత్తం 867సార్లు ట్వీట్ చేశారు. వారికి 1,268 మంది ఫాలోయర్స్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com