కేరళ కోసం 3 నెలలపాటు ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ విరాళాల సేకరణ

- August 28, 2018 , by Maagulf
కేరళ కోసం 3 నెలలపాటు ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ విరాళాల సేకరణ

మస్కట్‌: ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ (ఐఎస్‌సి) మూడు నెలలపాటు రిలీఫ్‌ ఫండ్స్‌ని కేళ వరద బాధితుల కోసం సేకరించనుంది. సుల్తానేట్‌లో ఐఎస్‌సి మాత్రమే లైసెన్స్‌డ్‌ అథారిటీగా వుంది ఇలాంటి విషయాల్లో. మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, కేరళకు అందించే సహాయ కార్యక్రమాల్లో అత్యంత పారదర్శకవంగా వ్యవహరించనుంది. మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అనుమతితోనే విరాళాల్ని సేకరిస్తున్నామని ఐఎస్‌సి ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ నంబియార్‌ చెప్పారు. ఫుడ్‌, వస్త్రాలు, మందులు మాత్రం స్వీకరించబడవని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 5కోట్ల రూపాయల్ని విరాళాలుగా స్వీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు సతీష్‌ నంబియార్‌. గుజరాత్‌ భూకంపం సమయంలోనూ, బీహార్‌ వరదల సమయంలోనూ, సునామీ, ఉత్తరాఖండ్‌ వరదల సమయంలోనూ తాము సేకరించిన విరాళాలు ఎంతగానో ఉపయోగపడినట్లు సతీష్‌ నంబియార్‌ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com