ఇండోనేసియాలో భూకంపం

- August 29, 2018 , by Maagulf
ఇండోనేసియాలో భూకంపం

జకార్తా: ఇండోనేసియా తూర్పుప్రాంతంలో అత్యంత తీవ్రస్థాయి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 6.2 ప్రకంపనల స్థాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాల బారినపడే దేశంగా ఇండోనేసియాకు పేరుంది. అంతేకాకుండా ఆసియా పసిఫిక్‌దేశాల్లో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా చెపుతారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే అంచనాలప్రకారం సునామి హెచ్చరికలు సైతం ఉండవచ్చని వెల్లడించింది. సముద్ర జలాల్లో వెల్లువెత్తిన ఈ తీవ్రత సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోతుగాను, వంద కిలోమీటర్ల ఈశాన్యప్రాంత సముద్రజలాలనుంచి ఉద్భవించింది. ఇండోనేసియా ప్రాంతంలోని టిమార్‌ దీవుల్లో ఈ భూకంపం సంభవించిందని అమెరికా ఏజెన్సీ వెల్లడించింది. కొన్ని సెకన్లపాటు అత్యంత తీవ్రస్థాయిలోప్రకంపనలు వణికించాయి. ఒక కంపెనీ అధికారి మాట్లాడుతూ తాను రెండో అంతస్తులో తన కార్యాలయంలో ఉండగా అందరూ బైటికి పరుగులు తీస్తున్నారని అదేమనిచూస్తే భూకంపం సంభవించిందని చెప్పడంతో తాను కూడా బైటికి పరుగుతీసినట్లు వెల్లడించారు. అన్ని కుర్చీలు సుడులు తిరుగుతూ కనిపించాయని, ఈ భూకంపంతో తాము మరింత వణికినట్లు వెల్లడించారు. లాంబాక్‌ దీవిని ఇటీవలి కాలంలో భూకంపాలు వణికించాయి.

సుమారు 555 మందిని బలిగొన్నాయి. 2004లో సునామి రిక్టర్‌స్కేలుపై 9.3తీవ్రస్థాయిని నమోదుచేసింది. సుమత్రా దీవుల్లో సంభవించిన ఈ కుంభకోణంలో 2.20లక్షల మంది చనిపోయినట్లు అంచనా. హిందూమహాసముద్రంలో సంభవించిన ఈ భూకంపంలో ఇండోనేసియా దేశీయులే 1.68 లక్షలమందివరకూ చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com