అబుదాబీలో అగ్ని ప్రమాదం: బాలిక మృతి
- August 29, 2018
అబుదాబీలోని అల్ జహియా రెసిడెన్షియల్ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన బాలిక వయసు 10 సంవత్సరాలు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేయడం జరిగింది. మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో ఘటనలో హమమాద్ బిన్ మొహమ్మద్ రోడ్డులోగల ఓ భవనం అగ్ని కీలల్లో చిక్కుకుంది. సివిల్ డిఫెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి, నష్టం పెరగకుండా చేయగలిగారు. హౌసింగ్ యూనిట్స్‌లో ఫైర్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్ ఖచ్చితంగా వుండాలనీ, వాటి పని తీరు పట్ల ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందేనని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ మయూఫ్ అల్ కెత్బి చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్