బ్రేవ్‌ 16 ఫైట్‌ కార్డ్‌ని ప్రకటించిన బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌

- August 31, 2018 , by Maagulf
బ్రేవ్‌ 16 ఫైట్‌ కార్డ్‌ని ప్రకటించిన బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌

మనామా: బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌, ఫుల్‌ ఫైట్‌ కార్డ్‌ని బ్రేవ్‌ 16 కోసం ప్రకటించింది. బ్రేవ్‌ 16, అబుదాబీలోని ముబాదాలా ఎరీనాలో సెప్టెంబర్‌ 21న జరగనుంది. షేక్‌ ఖాలిద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలో ఇది జరుగుతుంది. ఈ ఫైట్‌ కార్డ్‌లో రెండు మేజర్‌ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ ఫైట్స్‌ జరుగుతాయి. వాల్టర్‌ వెయిట్‌ ఛాంపియన్‌, గయానాకి చెందిన కార్ల్‌స్టన్‌ హారిస్‌ - జోర్డాన్‌కి చెందిన జర్రా అల్‌ సెలావె మధ్య జరుగుతుంది. కో-మెయిన్‌ ఈవెంట్‌లో ఫెదర్‌వెయిట్‌ ఛాంపియన్‌ ఎలియాస్‌ బోడెజ్‌డామ్‌ (అల్జీరియా) పోటీ పడ్తున్నారు. అమెరికాకి చెందిన బుబ్బా జెన్కిన్స్‌ ఆయన ప్రత్యర్థి. ఇదిలా ఉంటే 2018 బ్రేవ్‌ ఇంటర్నేషనల్‌ కంబాట్‌ వీక్‌ని బహ్రెయిన్‌ హోస్ట్‌ చేస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com