ఎల్‌ఐసీ 62వ వార్షికోత్సవం

- August 31, 2018 , by Maagulf
ఎల్‌ఐసీ 62వ వార్షికోత్సవం

జీవిత బీమారంగంలో లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 79.67 శాతం మార్కెట్ వాటా కలిగి ఉందని ఎల్‌ఐసీ మార్కెటింగ్ రీజనల్ మేనేజర్ జగన్నాధ్ తెలిపారు . హైదరాబాద్ గోల్కొండ హోటల్‌లో ఎల్‌ఐసీ 62 వ వార్షికోత్సవంను పురస్కరించుకుని వారం రోజుల పాటు జీవిత బీమాపై అవగాహన కార్యక్రమాలకు సంబందించిన బ్రోచన్‌ను ఆవిష్కరించారు. బీమా సేవలను సులభతరం చేసేందుకు మై ఎల్‌ఐసీ యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు . 1956లో ఐదు కోట్ల రూపాయలతో మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసీ నేడు 28 లకల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com