వలసదారుడి ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించిన పోలీసులు

- September 01, 2018 , by Maagulf
వలసదారుడి ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించిన పోలీసులు

అబుదాబీ నివాసితుడొకరు టెలికమ్యూనికేషన్‌ టవర్‌ ఎక్కి, ఆ టవర్‌ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకోగా, పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అతన్ని కిందికి దించారు. ఆ వ్యక్తిని ఆసియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీస్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ ముసల్లామ్‌ మొహమ్మద్‌ అల్‌ అమెరి మాట్లాడుతూ, టవర్‌ నుంచి దూకేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడనీ, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, అతన్ని బుజ్జగించి కిందికి తీసుకొచ్చారని చెప్పారు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే పోలీస్‌, సివిల్‌ డిఫెన్స్‌ మరియు పారామెడిక్స్‌ని అక్కడికి పంపించారు. గత ఏడాది నవంబర్‌లో ఓ యంగ్‌ ఎమిరేటీని కూడా ఇలాగే రక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com