రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి...
- September 02, 2018
జ్ఞాపకశక్తి అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. ఇటీవల కాలంలోమనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, లోపం వలన మనం అనేక మందులను వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇలా మందులను వాడేకంటే మన పెరటిలో ఉండే ఉసిరికాయ వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. పుల్లపుల్లగా వగరుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. యాపిల్‌తో పోలిస్తే ఇందులో మూడురెట్లు ప్రోటీన్లు ఉన్నాయి.
దానిమ్మ పండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీవైరల్, యాంటీమాక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ రక్తప్రసరణను మెరుగు పరిచి శరీరంలో అధికంగా పేరుకుపోయిన క్రొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. లైంగిక సామర్ధ్యం పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్రను పోషిస్తుంది.
అలసటను దూరం చేస్తుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరు మెరుగు పరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి శరీరానికి మేలు చేస్తుంది. జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. చుండ్రు కేశ సంబంధిత అనేక సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉసిరిని తీసుకోవడం వల్ల చర్మంపై మచ్చలను, వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను నివారించుకోవచ్చు. ఉసిరిని ముద్దగా నూరి అందులో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె కలిపి శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల చర్మం సహజ సౌందర్యంతో మిలమిల మెరుస్తూ ఉంటుంది.
రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి తీసుకుంటే ఎసిడిటీ లేదా కడుపుమంట నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ప్రతిరోజు ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా రక్తశుద్ది జరుగుతుంది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు