ప్రమాదంలో కేరళ చేపలమ్మాయి..

- September 03, 2018 , by Maagulf
ప్రమాదంలో కేరళ చేపలమ్మాయి..

కేరళ:కేరళలో చేపల్లమ్ముతూ వరద బాధితులకు తన వంతు సహాయాన్ని అందించి సోషల్ మీడియాలో పాపులర్ అయిన చేపలమ్మాయి హనన్‌ హమీద్‌‌ (21) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హసన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న(సోమవారం) హసన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన స్తంభాన్ని డీకొట్టింది.. దీంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు గమనించి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇడుక్కిలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో హనన్ బీయస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. తన కాలేజీ ఫీజుల కోసం, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆమె కాలేజీకి వెళ్లొచ్చి.. ఖాళీగా ఉన్న సమయంలో చేపలు అమ్మేది. ఆ వచ్చిన ఆదాయంతోపాటు తనకు సహాయంగా ఇచ్చిన కొంత డబ్బును కేరళ వరద బాధితులకు ఇచ్చి మంచి మనుసును చాటుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com