బ్యాంక్ వినియోగదారుల్ని దోచుకున్న ఇద్దరి అరెస్ట్
- September 06, 2018
మస్కట్: అరబ్ జాతీయులు ఇద్దరు, బ్యాంక్ కస్టమర్ల వద్ద నుంచి డబ్బుని దొంగిలిస్తున్న అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. పెద్ద మొత్తంలో డబ్బుని బ్యాంకు నుంచి 'విత్ డ్రా' చేసే వినియోగదారుల్ని గుర్తించి, వారిని ఫాలో అవుతూ, వారు ఆగగానే దొంగతనానికి పాల్పడటం నిందితులకు వెన్నతో పెట్టిన విద్య. వాహన అద్దాలు పగలగొట్టి, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుల గురించి పోలీసులు చెప్పారు. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనంతరం ఇద్దర్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ తెలిపారు. పౌరులు, నివాసితులు బ్యాంకుల నుంచి డబ్బుల్ని తీసుకునేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, డబ్బును తమ కార్లలో వదిలిపెట్టడం, భద్రత లేకుండా వుంచడం చేయకూడదని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!